గణేష్ నిమజ్జన కార్యక్రమాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే, మున్సిపల్ చైర్‌పర్సన్

జగిత్యాలలోని చింతకుంట చెరువు వద్ద కొనసాగుతున్న గణేష్ నిమజ్జన కార్యక్రమాన్ని ఎమ్మెల్యే సంజయ్ కుమార్, మున్సిపల్ చైర్‌పర్సన్ సమిండ్ల వాణి శ్రీనివాస్ గురువారం పరిశీలించారు. జగిత్యాలతో పాటు పరిసర ప్రాంతాల్లో సుమారు 700కు పైగా వినాయక విగ్రహాలను ప్రతిష్టించి 9 రోజుల పాటు ప్రజలు భక్తిశ్రద్ధలతో పూజలు నిర్వహించారని, నిమజ్జన కార్యక్రమం ప్రశాంతంగా, సురక్షితంగా జరిగేలా మున్సిపాలిటీ, పోలీస్, విద్యుత్ శాఖల అధికారులు, సిబ్బంది సమన్వయంతో ఏర్పాట్లు చేశారని సంజయ్ పేర్కొన్నారు. జగిత్యాల పట్టణంలోని ప్రతి వార్డు అభివృద్ధికి రూ. 70 లక్షల నుంచి రూ. 80 లక్షల వరకు నిధులు కేటాయించి అభివృద్ధి పనులు చేపడుతున్నామన్నారు.

సంబంధిత పోస్ట్

✕
✕