రేపు కొండగట్టుకు పవన్ కళ్యాణ్.. రూ.30.19 కోట్ల పనులకు శంకుస్థాపన

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ శనివారం ఉదయం 10:30 గంటలకు కొండగట్టుకు రానున్నారు. అక్కడ రూ.30.19 కోట్ల టీటీడీ నిధులతో చేపట్టే అభివృద్ధి పనులకు ఆయన శంకుస్థాపన చేస్తారు. ఈ కార్యక్రమంలో టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు, ఏపీ శాసనమండలి విప్ హరిప్రసాద్, చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం కూడా పాల్గొంటారు. అనంతరం పవన్ కళ్యాణ్ కొడిమ్యాలలోని ఓ రిసార్టులో తెలంగాణ జనసేన నేతలతో సమావేశం కానున్నారు.

సంబంధిత పోస్ట్