పెగడపల్లి: ఫోన్ కొనివ్వలేదని 9వ తరగతి విద్యార్ధి ఆత్మహత్య

తండ్రి సెల్ ఫోన్ కొన్విలేదని, మనస్థాపానికి గురై 9వ తరగతి చదువుతున్న విద్యార్థి పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్న ఘటన జగిత్యాల జిల్లా పెగడపల్లి మండలం రాజరాంపల్లి గిరిజన తండాలో చోటు చేసుకుంది. పోలీసులు, గ్రామస్థులు తెలిపిన వివరాల ప్రకారం రాజరాంపల్లి తండాకు చెందిన ఇస్లావత్ నరేష్ నాయక్ కొడుకు సాయి గణేష్ నాయక్ (14) సెల్ ఫోన్ కొనివ్వాలని కోరగా, చదువుకుంటున్నావు నీకు ఇప్పుడే ఫోన్ ఎందుకని మందలించాడు. దీంతో మనస్థాపానికి గురైన సాయి గణేష్ నాయక్ గడ్డి మందు తాగి ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్

✕
✕