స్మశాన వాటికకు స్థలం కేటాయించాలని అధికారులకు వినతి పత్రం

జగిత్యాల జిల్లా రాయికల్ మండలం ఇటిక్యాల గ్రామానికి చెందిన నాయకులు సోమవారం ప్రజావాణి కార్యక్రమంలో అధికారులకు వినతి పత్రం అందజేశారు. తమ గ్రామంలో స్మశాన వాటికకు స్థలం కేటాయించాలని వారు కోరారు. ప్రస్తుతం దహన సంస్కారాలు వాగు మధ్య ఇసుకలో చేయాల్సి వస్తుందని, వర్షాకాలంలో నీటి ప్రవాహం వలన తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని తెలిపారు. తమ గ్రామానికి శాశ్వత స్మశాన వాటికను ఏర్పాటు చేసి సమస్యను పరిష్కరించాలని సంబంధిత అధికారులను అభ్యర్థించారు.

సంబంధిత పోస్ట్