మామిడి రైతులను ఆదుకుంటాం: మంత్రి లక్ష్మణ్ కుమార్

జగిత్యాల జిల్లాలోని మామిడి రైతులను ప్రభుత్వ పరంగా ఆదుకుంటామని రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి లక్ష్మణ్ కుమార్ పేర్కొన్నారు. జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండలం ఇబ్రహీంనగర్ రైతు వేదిక వద్ద జిల్లా ఉద్యానవన శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన జిల్లా స్థాయి మామిడి రైతుల వర్క్ షాప్ లో మంత్రి ఈ వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలోనే జగిత్యాల జిల్లాలో అత్యధికంగా మామిడి సాగు అవుతుందని, పంట దిగుబడుల పెంపకంతో పాటు మార్కెట్ సౌకర్యం ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటామని మంత్రి వివరించారు.

సంబంధిత పోస్ట్