కరీంనగర్: దంపతుల గొడవ.. భార్య ఆత్మహత్య

ఓ మహిళ ఆత్మహత్య చేసుకున్న ఘటన KNRజిల్లా జమ్మికుంటలో జరిగింది. CI రామకృష్ణ గౌడ్ తెలిపిన వివరాలు.. స్థానిక FCIగోదాం దగ్గర బిహార్ వాసి రాహుల్ కుమార్, తన భార్య పూజాకుమారి(26)తో అద్దెకు ఉంటున్నాడు. వీరికి ముగ్గురు పిల్లలు. ఈ క్రమంలో చపాతీ వేడిగా లేదన్న కారణంగా దంపతుల మధ్య గొడవ జరిగింది. మనస్తాపానికి గురైన పూజ క్షణికావేశంలో తాను కట్టుకున్న చీరతోనే ఊరేసుకొని చనిపోయింది. భర్త ఫిర్యాదు మేరకు కేసు నమోదైంది.

సంబంధిత పోస్ట్