కరీంనగర్: మల్లన్న గుడిలో చోరీ కలకలం

శుక్రవారం రాత్రి చిగురుమామిడి మండలం గాగిరెడ్డిపల్లిలోని యాలాల మల్లికార్జున స్వామి ఆలయంలో దొంగతనం జరిగింది. శనివారం ఉదయం యాదవ సంఘం సభ్యులు ఆలయానికి వెళ్లి చూడగా, తాళం పగలగొట్టి ఉండటాన్ని గమనించారు. లోపలికి వెళ్లి పరిశీలించగా, ఆలయంలో చోరీ జరిగినట్లు నిర్ధారించుకుని, వెంటనే స్థానిక పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని, కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.

సంబంధిత పోస్ట్