సంక్రాంతి పండుగ సెలవులు ప్రారంభం కావడంతో హుజూరాబాద్ బస్టాండ్ ప్రయాణికులతో కిక్కిరిసిపోయింది. శుక్రవారం సాయంత్రం నుంచి విద్యార్థులు, ఆశ్రమ పాఠశాలల బాలబాలికలు పెద్ద సంఖ్యలో తమ స్వగ్రామాలకు బయలుదేరడంతో బస్టాండ్ ప్రాంగణం జనసంద్రంగా మారింది. బస్సుల కోసం ప్రయాణికులు గంటల తరబడి పడిగాపులు కాస్తున్నారు. రద్దీకి అనుగుణంగా అదనపు బస్సులను నడపాలని ప్రయాణికులు డిమాండ్ చేస్తున్నారు. ఈ రద్దీ కారణంగా ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.