కరీంనగర్: మున్నూరు కాపు కార్పొరేషన్‌ ఛైర్మన్‌గా శ్రీరామ్

మున్నూరు కాపు కార్పొరేషన్ ఛైర్మన్‌గా కాంగ్రెస్ నేత బొమ్మ శ్రీరామ్ బుధవారం నియమితులయ్యారు. ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయగా, ఆయన మంత్రి పొన్నం ప్రభాకర్‌తో కలిసి సీఎంను కలిసి కృతజ్ఞతలు తెలిపారు. తన తండ్రి, మాజీ ఎమ్మెల్యే బొమ్మ వెంకటేశ్వర్ వారసత్వాన్ని కొనసాగిస్తూ ప్రజాసేవ చేస్తానని శ్రీరామ్ పేర్కొన్నారు. ఈ నియామకంపై జిల్లా కాంగ్రెస్ నేతలు, మున్నూరు కాపు సంఘం ప్రతినిధులు హర్షం వ్యక్తం చేశారు.

సంబంధిత పోస్ట్