కష్టాలు ఎదురైనా పట్టుదల ఉంటే విజయం సాధ్యమని నిరూపించింది ఇల్లందకుంటకు చెందిన విద్యార్థిని కందాల శ్రీనిహిత. చిన్నతనంలోనే తండ్రిని కోల్పోయినప్పటికీ తల్లి శ్వేత ప్రోత్సాహంతో పదో తరగతి ఫలితాల్లో అద్భుతమైన మార్కులు సాధించి అందరి ప్రశంసలు అందుకుంటోంది. హుజూరాబాద్‌లోని MJPలో చదువుతున్న కందాల శ్రీనిహిత పదో తరగతి ఫలితాల్లో 550 మార్కులు సాధించి సత్తా చాటింది. ఉపాధ్యాయులు విద్యార్థినినీ అభినందించారు.