కరీంనగర్ జిల్లా రామడుగు మండలం కొరటాపల్లి గ్రామంలో 80 ఏళ్ల పైబడిన మేకల సురేందర్ రెడ్డి, మన్నెమ్మ దంపతుల అన్యోన్య దాంపత్యం విషాదాంతమైంది. బుధవారం సురేందర్ రెడ్డి మృతి చెందిన కొద్ది గంటల్లోనే, భర్తను విడిచి ఉండలేనంటూ ఆయన భార్య మన్నెమ్మ కూడా తుది శ్వాస విడిచారు. వీరి మరణంతో కుటుంబ సభ్యులు, గ్రామస్తులు తీవ్ర దిగ్భ్రాంతికి లోనయ్యారు. ఈ దంపతులకు ఇద్దరు కుమారులు కాగా, పెద్ద కుమారుడు పోలీస్ శాఖలో ఏఎస్ఐగా, చిన్న కుమారుడు భారతీయ జనతా పార్టీలో పనిచేస్తున్నారు.