ఘోర రోడ్డు ప్రమాదం.. ఒకరు మృతి

శుక్రవారం ఉదయం కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండల కేంద్రంలోని రాజీవ్ రహదారిపై శ్రీ చైతన్య పాఠశాల సమీపంలో ఈ రోడ్డు ప్రమాదం జరిగింది. కరీంనగర్ నుంచి హైదరాబాద్ వైపు అతివేగంతో వెళ్తున్న థార్ వాహనం రోడ్డు పక్కన ఉన్న కల్వర్టు గోడను ఢీకొట్టింది. ఈ దుర్ఘటనలో వాహనం నడుపుతున్న వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందగా, వాహనంలో ప్రయాణిస్తున్న మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన వారిలో ఒక మహిళ కూడా ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ప్రమాదానికి గల పూర్తి కారణాలపై విచారణ జరుగుతోంది.

సంబంధిత పోస్ట్