కరీంనగర్: ఆ పాఠశాలలో ప్రవేశాలకు దరఖాస్తులకు ఆహ్వానం

కరీంనగర్ ప్రభుత్వ బధిరుల ఆశ్రమ పాఠశాలలో 2026-27 విద్యా సంవత్సరానికి 1-9 తరగతులకు (ఇంగ్లీష్/తెలుగు మీడియం) మరియు 10వ తరగతికి (తెలుగు మీడియం) ప్రవేశాలు ప్రారంభమయ్యాయని ఇన్ఛార్జ్ ప్రిన్సిపల్ భాస్కర్ తెలిపారు. 6 నుండి 14 ఏళ్ల వయస్సు గల చెవిటి పిల్లలు ఈ ప్రవేశాలకు అర్హులు. ఉమ్మడి కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, వరంగల్ జిల్లాల వారికి ప్రాధాన్యత ఇవ్వబడుతుంది. విద్యార్థులకు ఉచిత విద్యతో పాటు పుస్తకాలు, యూనిఫారం, భోజనం, వసతి సౌకర్యాలు కల్పించబడతాయి. సదరం సర్టిఫికెట్, ఆధార్, టీసీతో పాటు 9000013639, 94400952842 నంబర్లలో సంప్రదించవచ్చని సూచించారు.

సంబంధిత పోస్ట్