కరీంనగర్: అంజనాద్రి క్షేత్రంలో స్వామిపై సూర్యకిరణాలు

కరీంనగర్ పరిధి భగత్నగర్ గుట్టపై ఉన్న అంజనాద్రి క్షేత్రంలో కార్తీక పౌర్ణమి సందర్భంగా అద్భుత దృశ్యం కనిపించింది. బుధవారం ఉదయం సూర్యోదయ సమయంలో సూర్య కిరణాలు స్వయంభు హనుమాన్ విగ్రహంపై నేరుగా పడి భక్తులను మంత్రముగ్ధులను చేశాయి. ఆలయ పూజారుల ప్రకారం ప్రతి ఏడాది ఈ పుణ్యదినాన ఇదే విధంగా సూర్యకాంతులు విగ్రహాన్ని తాకుతాయని తెలిపారు. ఇది దేవస్థాన నిర్మాణ శైలికి, ఆ స్థల పవిత్రతకు నిదర్శనమని వారు పేర్కొన్నారు

సంబంధిత పోస్ట్