మాదరి భాగ్య రెడ్డి వర్మ 85వ వర్ధంతి కార్యక్రమాన్ని ఆదివారం సాయంత్రం కరీంనగర్ మాతశిశు ఆసుపత్రి వద్ద దళిత సంఘాల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా భాగ్యరెడ్డి వర్మ విగ్రహాన్ని పూలమాలతో అలంకరించి, జ్యోతిని వెలిగించి మౌనం పాటించారు. భాగ్య రెడ్డి తెలంగాణ గడ్డపై పుట్టిన మొట్టమొదటి దళిత ఉద్యమ నాయకుడు, హైదరాబాద్ అంబేద్కర్ గా పేరు పొందారని కాంగ్రెస్ ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షుడు అరుణ్ తెలిపారు.