కరీంనగర్లోని రాంనగర్లో శ్రీరమా సహిత సత్యనారాయణ స్వామి ఆలయం వద్ద పోచమ్మ బోనాల మహోత్సవాన్ని ఈరోజు ఘనంగా నిర్వహించారు. ఎంఆర్ మున్నూరు కాపు సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో మహిళలు పెద్ద సంఖ్యలో హాజరై అమ్మవారికి బోనాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. ఈ కార్యక్రమంలో మాజీ డిప్యూటీ మేయర్ చల్ల స్వరూపరాణి హరిశంకర్, మున్నూరు కాపు సంఘం సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.