కొండా లక్ష్మణ్ జాతీయ ఎక్స్ లెన్స్ అవార్డు అందుకున్న సాంబయ్య

చొప్పదండి మాజీ జడ్పిటీసి ఇప్పనపెల్లి సాంబయ్య కొండా లక్ష్మణ్ బాపూజీ జాతీయ ఎక్స్ లెన్స్ అవార్డు అందుకున్నారు. అఖిల భారత పద్మశాలి సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో హైదరాబాద్ రవీంద్ర భారతి లో ఆదివారం కొండా లక్ష్మణ్ 111వ జయంతి సందర్బంగా ఈ అవార్డును ప్రధానం చేశారు. ప్రజా సేవ, చేనేత కార్మికుల అభ్యున్నతి, గ్రామీణ అభివృద్ధి, బలహీన వర్గాల సంక్షేమానికి చేసిన సేవలకు గుర్తింపుగా ఈ పురస్కారానికి ఆయన ఎంపికైనట్లు తెలిపారు.

సంబంధిత పోస్ట్

✕
✕