ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో దొంగలు తాళం వేసిన ఇళ్లను లక్ష్యంగా చేసుకుని దోపిడీలకు పాల్పడుతున్నారు. ఈనెల 25న శనివారం పెద్దపల్లి మండలం రాఘవాపూర్‌లో రిటైర్డ్ సింగరేణి ఉద్యోగి ఇంట్లో చొరబడి 20 తులాల వెండి, నగదును ఎత్తుకెళ్లారు. ఆదివారం ధర్మపురి పట్టణంలోనూ ఇదే తరహాలో వెండి, నగదు చోరీ జరిగింది. ప్రయాణాల్లో ఉన్నప్పుడు అప్రమత్తంగా ఉండాలని, ముందస్తు సమాచారం ఇవ్వాలని పోలీసులు సూచిస్తున్నారు.