అక్షయ్ కు ఖరగ్ పూర్ ఐఐటీ పీహెచ్ డీ డిగ్రీ ప్రదానం

కోరుట్ల మండలం సిరికొండ గ్రామానికి చెందిన చేట్ పెల్లి అక్షయ్, సోమవారం రోజున ఐఐటీ ఖరగ్ పూర్ 72వ స్నాతకోత్సవంలో ప్రొఫెసర్ పార్థ సాహ, డీన్ లు ఆనంద్ భట్టాచార్య, గార్గి దాస్ చేతుల మీదుగా పీహెచ్‌డీ డిగ్రీ అందుకున్నారు. 'ఇన్ఫ్రారెడ్ అణచివేత పరికరాలు' అనే అంశంపై ఆయన డాక్టరేట్ పొందారు. అత్యుత్తమ విద్యాసంస్థ నుండి డిగ్రీ అందుకోవడం చాలా ఆనందంగా ఉందని అక్షయ్ తెలిపారు. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ ముదాం రవి, ఉప సర్పంచ్ చిట్కూరి మల్లయ్య, గాంధారి శ్రీనివాస్, మల్యాల మారుతి, ప్రతాప్, ప్రశాంత్, వెంకటేష్ అక్షయ్ ను అభినందించారు.

సంబంధిత పోస్ట్