జగిత్యాల: అనుమానాస్పద స్థితిలో యువతి మృతి

జగిత్యాల జిల్లా కోరుట్ల నియోజకవర్గంలో పెద్దాపూర్ గ్రామానికి చెందిన ఇల్లేందుల దివ్య(34) అనుమాదాస్పద స్థితిలో మృతి చెందిన కేసులో కీలక మలుపు చోటుచేసుకుంది. సోమవారం ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్న దివ్య కేసులో, ఆమె తండ్రి కోటగిరి గోపాల చారి ఫిర్యాదు మేరకు భర్త ఇల్లెందుల ఉదయ్, మామ ఇల్లెందుల బ్రహ్మయ్యలపై కేసు నమోదైంది. భర్త వివాహేతర సంబంధాన్ని ఎదిరించినందుకే దివ్యను మానసికంగా, శారీరకంగా వేధించారని, వారి బాధ భరించలేక ఆత్మహత్య చేసుకుందని తండ్రి ఆరోపించారు. పోలీసులు ముగ్గురిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్