కథలాపూర్ మండల కేంద్రంతో పాటు 18 గ్రామాల్లో శుక్రవారం బీజేపీ ఆధ్వర్యంలో కేంద్ర హోమ్ శాఖ సహాయ మంత్రి, కరీంనగరం పార్లమెంట్ సభ్యులు బండి సంజయ్ కుమార్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా దేవాలయాల్లో ప్రత్యేక పూజలు చేసి సంజయ్ కుమార్ ఆయురారోగ్యాలతో క్షేమంగా ఉండాలని కోరారు. అనంతరం కేక్ కట్ చేసి మిఠాయిలు పంపిణీ చేశారు.