కోరుట్ల: నిర్మాణంలో ఉన్న రోడ్డును పరిశీలించిన నాయకులు

జగిత్యాల జిల్లా మెట్పల్లి మండలం వెల్లుల్లలోని పోచమ్మ నుండి మహాలక్ష్మి దేవాలయం వెళ్ళే రోడ్డును కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు జువ్వాడి నర్సింగరావు ఆదివారం పరిశీలించారు. ఇదివరకు ఈ రోడ్డు నిర్మాణానికి 60 లక్షల రూపాయలు నిధులు ఇవ్వడం జరిగింది. మిగతా పనికి గాను డబ్బులు మంజూరు చేయిస్తానని గ్రామస్థులకు హామీ ఇచ్చారు. అనంతరం గ్రామస్తులతో కలిసి పోచమ్మ మహాలక్ష్మి దేవాలయాన్ని దర్శించుకున్నారు.

సంబంధిత పోస్ట్