ఘనంగా జాతీయ డెంగ్యూ దినోత్సవ ర్యాలీ

కథలాపూర్ మండల ప్రాథమిక ఆరోగ్యకేంద్రం వైద్యాధికారిణి సింధూజ ఆధ్వర్యంలో శుక్రవారం రోజున డెంగ్యూ అవగాహన దినోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆసుపత్రి నుండీ కథలాపూర్ బస్టాండు వరకు ర్యాలీ చేశారు. దోమలు బారిన పడకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. మంగళవారం, శుక్రవారం డ్రైడేగా పాటించాలన్నారు. కార్యక్రమంలో సీహెచ్ఓ సుగుణ, హెల్త్ సూపర్వైజర్ శ్రీధర్, చిన్న రాజం, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్