కోరుట్ల పట్టణంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో శ్రవణా నక్షత్రాన్ని పురస్కరించుకుని, ఆలయ అర్చకులు బీరునంది నరసింహ చారి ఆధ్వర్యంలో సామూహిక వెంకటేశ్వర స్వామి వ్రతాలు వైభవంగా నిర్వహించారు. స్వామివారికి పంచామృత అభిషేకాలతో పాటు ప్రత్యేక పూజలు, అర్చనలు జరిగాయి. అనంతరం అన్నప్రసాద వితరణ జరిగింది. ఈ కార్యక్రమంలో చైర్మన్ నరసయ్య, జూనియర్ అసిస్టెంట్ నరసయ్య, భక్తులు పాల్గొన్నారు.