ఇల్లంతకుంట మండలంలో శనివారం బీజేపీ మహిళా మోర్చా మండల అధ్యక్షురాలు మారవేణి దివ్య, విద్యుత్ శాఖ అధికారికి వినతి పత్రం అందజేశారు. దాచారం గ్రామానికి ప్రత్యేక జూనియర్ లైన్మెన్‌ను నియమించాలని వారు కోరారు. ఈ గ్రామంలో ప్రత్యేక లైన్మెన్ లేకపోవడం వల్ల విద్యుత్ అంతరాయం ఏర్పడినప్పుడు రైతులు, గ్రామస్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆమె తెలిపారు.