ప్రజాపాలన - ప్రగతి ప్రణాళికలో భాగంగా, బాలల భద్రత మరియు డ్రగ్స్ రహిత తెలంగాణ వారోత్సవాల సందర్భంగా పెద్దలింగాపూర్‌లో సైబర్ క్రైమ్‌పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. కలెక్టర్ గరిమ అగ్రవాల్ అనధికార వ్యక్తులకు ఓటీపీ, ఇతర వివరాలు ఇవ్వకూడదని, 1930, 1098, 112 హెల్ప్‌లైన్ నంబర్లను ఫోన్‌లో సేవ్ చేసుకోవాలని సూచించారు. విద్యార్థులు చదువు, ఆటలపై దృష్టి సారించి, సోషల్ మీడియాకు దూరంగా ఉండాలని, అంగన్‌వాడీ సేవలను సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. ఎస్పీ మహేష్ బి గితే సైబర్ నేరాలకు గురైతే 1930 లేదా పోలీసులను సంప్రదించాలని తెలిపారు.