బండి సంజయ్ చేతుల మీదుగా బోరుబావి పనుల ప్రారంభం

కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం పోరండ్ల గ్రామంలోని పెద్దగుట్ట శ్రీ వీరబ్రహ్మేంద్ర సమేత లక్ష్మి నరసింహ స్వామి దేవాలయం వద్ద, కరీంనగర్ పార్లమెంటు సభ్యులు, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ మంజూరు చేసిన రూ. 2 లక్షల నిధులతో బోరుబావి పనులను మంగళవారం స్థానిక సర్పంచ్ అసోద శ్రీనివాస్ కొబ్బరికాయ కొట్టి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ నీలం ఓదేలు, వార్డు సభ్యులు, బిజెపి నాయకులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్