రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం పెద్ద లింగపూర్ గ్రామంలోని పీఎంశ్రీ MPPS పాఠశాలను తెలంగాణ రాష్ట్ర విద్యా శాఖ సీర్ట్ డైరెక్టర్ గాజర్ల రమేష్ గురువారం సందర్శించారు. పీఎంశ్రీ కార్యక్రమాల అమలును పరిశీలించి, ప్రీ ప్రైమరీ తరగతుల నిర్వహణ తీరును అభినందించి, విద్యార్థుల వసతులు బాగున్నాయని పేర్కొన్నారు. ఉపాధ్యాయ సిబ్బంది కృషిని అభినందించారు. ఈ కార్యక్రమంలో సెక్టోరియల్ ఆఫీసర్ అశోక్, ప్రధానోపాధ్యాయులు సందీప్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.