గొర్రెలు, మేకలకు మూగ జీవాలకు నట్టాల మందు పంపిణీ

ఇల్లంతకుంట మండలంలోని దాచారం గ్రామంలో శ్రీ కృష్ణ యాదవ సంఘం ఆధ్వర్యంలో వెటర్నరీ వైద్యులచే గొర్రెలు, మేకలకు ఉచిత మందులు అందించే కార్యక్రమం జరిగింది. గ్రామ పశుసంవర్ధక శాఖాధికారి పాల్గొని జంతువులకు వైద్యం అందించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ కుడుముల రేణుక, నాగరాజు, యాదవ సంఘం అధ్యక్షులు మారవేణి రాజు (శ్రీశైలం) యాదవ్, వార్డ్ సభ్యురాలు మారవేణి దివ్య, కనుకయ్య, రాజు, మలేష్, సంఘం సభ్యులు పాల్గొన్నారు. సర్పంచ్ కుడుముల రేణుక, నాగరాజు, వెటర్నరీ డాక్టర్ మేడంలను సన్మానించారు. గ్రామ ప్రజలు సహకరించిన అందరికీ సంఘం కృతజ్ఞతలు తెలిపింది.

సంబంధిత పోస్ట్