తిమ్మాపూర్ మండలం పోరండ్లలో ధాన్యం కొనుగోలు చేయకపోవడంతో రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. పోరండ్ల సొసైటీని మూసివేసి, సొసైటీ ఎదుట రోడ్డుపై రాస్తారోకో చేపట్టారు. నెలరోజులుగా ధాన్యం కుప్పలు పోసి ఉన్నా తూకం వేయడం లేదని, రైస్ మిల్లర్లు బస్తాకు ఐదు కిలోలు తరుగు తీస్తున్నారని రైతులు వాపోయారు. తరుగు లేకుండా ధాన్యం కొనుగోలు చేయాలని అన్నదాతలు డిమాండ్ చేస్తున్నారు.