తిమ్మాపూర్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం: ఆటో, కారు, బైక్ ను ఢీకొన్న బొలెరో

తిమ్మాపూర్ మండలం నుస్తులాపూర్ వద్ద ఆగి ఉన్న ఆటోను బొలెరో వాహనం ఢీకొట్టింది. ఆ తర్వాత ఆటో కారును, కారు బైక్‌ను ఢీకొన్నాయి. రోడ్డుపై బోల్తా పడిన బొలెరో వాహనం. ఈ ఘటనలో కొత్తపల్లికి చెందిన ఆటో డ్రైవర్ దుంబాల శ్రీనివాస్‌కు గాయాలయ్యాయి. గాయపడిన శ్రీనివాసును 108 ద్వారా కరీంనగర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని, బొలెరో డ్రైవర్ మద్యం తాగి వాహనం నడపడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని తెలిపారు.

సంబంధిత పోస్ట్