గన్నేరువరం మండలం పోలీస్ స్టేషన్ పరిధిలో శనివారం రాజకీయ పార్టీలకు ర్యాలీలు, ధర్నా, రాస్తారోకో వంటి కార్యక్రమాలు చేపట్టడానికి ముందస్తుగా ఎవరికి అనుమతి ఇవ్వడం లేదని ఎస్ఐ నరేందర్ రెడ్డి శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఎవరైనా పోలీస్ నిబంధనలను ఉల్లంఘించి కార్యక్రమాలు చేపట్టినట్లయితే చట్ట ప్రకారం కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు.