గన్నేరువరం మండలం కాసింపేట గ్రామంలో స్వయంభుగా వెలసిన శ్రీ మానసా దేవి ఆలయంలో శ్రావణమాసం శుక్రవారం అపురూప లక్ష్మి అమ్మవారికి క్షీరాభిషేకం, 108 చీరలతో లక్ష్మీ అమ్మవారికి అలంకరణ, కుంకుమ పూజలు, మానసా దేవి అమ్మవారికి 108 చీరలతో అలంకరణగావించారు. భక్తులు ఆలయానికి వచ్చి 108 జంట నాగ శివలింగాలకు నీటితో అభిషేకం చేశారు. ఒడి బియ్యం పోశారు. ముడుపులు కట్టారు. మానసా అమ్మవారికి, అపురూప లక్ష్మి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.