ధాన్యం బస్తాలు పేరుకుపోతున్నాయి, లారీలు రాకతో రైతుల ఆందోళన

రాజన్న సిరిసిల్ల జిల్లా మానకొండూర్ నియోజకవర్గం ఇల్లంతకుంట మండలంలో మంగళవారం వడ్ల కొనుగోలు కేంద్రాల్లో లారీలు రాకపోవడంతో ధాన్యం బస్తాలు పేరుకుపోతున్నాయి. తూకం వేసి వారం గడిచినా లారీలు రాకపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. కొనుగోలు ప్రక్రియ నెమ్మదిగా సాగుతోందని, అధికారులు వెంటనే లారీలు సమకూర్చి ధాన్యాన్ని గోదాములకు తరలించాలని రైతులు విజ్ఞప్తి చేశారు. ప్రతి సంవత్సరం ఇదే సమస్య ఎదురవుతోందని, ప్రభుత్వ యంత్రాంగం సమయానికి స్పందించడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు.

సంబంధిత పోస్ట్