కరీంనగర్: ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మృతి (వీడియో)

తిమ్మాపూర్(ఎం) మండలం రేణిగుంట వద్ద గురువారం తెల్లవారుజామున పల్సర్ బైక్ ను గుర్తు తెలియని వాహనం ఢీ కొట్టడంతో బైక్ పై ఉన్న ఇద్దరు వ్యక్తులు తీవ్ర గాయాలు అయి అక్కడికక్కడే మృతి చెందారు. మృతులు బెజ్జంకి మండల కేంద్రానికి చెందిన భాను ప్రసాద్, చీమలకుంటపల్లెకు చెందిన నరేష్ గా స్థానికులు గుర్తించారు. ఘటన స్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్