కరీంనగర్: మాజీ ఎమ్మెల్యే రసమయి సంచలన ఆరోపణలు

మానకొండూరు మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్, ప్రస్తుత ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణపై తీవ్ర ఆరోపణలు చేశారు. కమిషన్లు, కబ్జాలకు పాల్పడుతున్నారని, గ్రానైట్ క్వారీలను ఆక్రమించి, మైలారం మల్లికార్జున స్వామి గుట్టపై కన్ను వేశారని ధ్వజమెత్తారు. దళిత మంత్రి వివేక్ సంతకాన్ని ఫోర్జరీ చేసి రూ.200 కోట్ల కుంభకోణానికి తెరలేపారని విమర్శించారు. ఇసుక క్వారీలు, గనుల కబ్జాతో పాటు ఇథనాల్ ఫ్యాక్టరీ నుంచి కూడా డబ్బులు వసూలు చేశారని ఆరోపించారు. అలుగునూర్ చౌరస్తాలో ఇందిరమ్మ ఇండ్లకు సిమెంట్, సలాక కొనేలా చేస్తూ డబ్బులు దండుకుంటున్నారని మండిపడ్డారు. ఈ అక్రమాలపై సీపీకి ఫిర్యాదు చేస్తామని తెలిపారు.

సంబంధిత పోస్ట్