జర్నలిస్టుల సమస్యలపై డిసెంబర్ 3న హైదరాబాద్‌లో మహా ధర్నా

రాజన్న సిరిసిల్ల జిల్లా మానకొండూర్ నియోజకవర్గం ఇల్లంతకుంట మండలంలో, జర్నలిస్టుల సమస్యలను ప్రభుత్వం తక్షణం పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ డిసెంబర్ 3న హైదరాబాద్‌లో మహా ధర్నా నిర్వహించనున్నట్లు టీయూడబ్ల్యూజే మండల అధ్యక్షుడు మారుపాక అనిల్ కుమార్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, జర్నలిస్టులకు కొత్త అక్రెడిటేషన్ కార్డులు జారీ చేయాలని, ఆరోగ్య భీమా పథకాన్ని పునరుద్ధరించాలని, అర్హులైన జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు మంజూరు చేయాలని, వృత్తి కమిటీని వెంటనే ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. డిసెంబర్ 3న హైదరాబాద్ మసాబ్ ట్యాంక్‌లోని రాష్ట్ర సమాచార కమిషనర్ కార్యాలయం వద్ద ఉదయం 10 గంటలకు జరగనున్న ఈ మహా ధర్నాలో రాష్ట్ర, జాతీయ, జిల్లా, మండల నాయకులు, యూనియన్ సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు.

సంబంధిత పోస్ట్