బావిలో పడి వ్యక్తి దుర్మరణం

మంగళవారం మానకొండూర్ మండల పరిధిలోని శంషాబాద్ గ్రామంలో మేర్లు రాయమల్లు (75) అనే వృద్ధుడు బహిర్భూమి కోసం సమీప వ్యవసాయ బావి వద్దకు వెళ్లగా, ప్రమాదవశాత్తు కాలు జారి బావిలో పడి మృతి చెందాడు. గ్రామస్థులు, సమీప వ్యక్తులు కాపాడే ప్రయత్నం చేసినా ఫలితం లేకపోయింది. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని, గజ ఈతగాళ్ల సహాయంతో మృతదేహాన్ని బయటకు తీశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్