ప్రజా సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ ద్వేయమని మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ అన్నారు. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం నల్లగొండ గ్రామంలో శుక్రవారం 12 మంది నిరుపేదలకు ఇంటి స్థలంతో పాటు ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి ముగ్గు పోసి ఇందిరమ్మ ఇండ్ల పట్టలను ఎమ్మెల్యే చేతుల మీదుగా లబ్ధిదారులకు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ 10 ఏళ్లుగా బిఆర్ఎస్ ప్రభుత్వం పేదలను పట్టించుకోలేదని విమర్శించారు.