మానకొండూర్ నియోజకవర్గం ఇల్లంతకుంట మండలంలోని రహీంఖాన్ పేట గ్రామ ఆదర్శ పాఠశాలలో క్రీడా దుస్తులు పంపిణీ కార్యక్రమం జరిగింది. గడ్డమీది శ్రీనివాస్ మాట్లాడుతూ విద్యార్థులు క్రీడల్లో ఉత్తమంగా రాణించి పాఠశాలకు పేరు తెచ్చాలని సూచించారు. ఎస్ఐ సిరిసిల్ల అశోక్, ప్రిన్సిపల్ గంగాధర్, ఉపాధ్యాయులు, యువకులు పాల్గొన్నారు.