పేద కుటుంబానికి పెద్ద కొడుకుల అండగా నిలిచిన ఎమ్మెల్యే సత్యం

బోయినిపల్లి మండలం రామన్నపేట గ్రామానికి చెందిన దాసరి రాజు అనారోగ్యం, షుగర్ కారణంగా కాలు తీసివేయాల్సి వచ్చింది. రెండవ కాలుకు కూడా ఇన్ఫెక్షన్ తో బాధపడుతున్న రాజు విషయాన్ని స్థానిక నాయకులు ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం దృష్టికి తీసుకెళ్లారు. వెంటనే స్పందించిన ఎమ్మెల్యే, చికిత్స నిమిత్తం హైదరాబాద్ నిమ్స్ ఆసుపత్రికి ప్రభుత్వం తరపున రూ. 5 లక్షల ఆర్థిక సహాయం అందించారు. రామన్నపేట గ్రామస్తులు ఎమ్మెల్యేకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

సంబంధిత పోస్ట్