అంగన్వాడి కేంద్రంలో పౌష్టికాహారం అవగాహన సదస్సు

ఇల్లంతకుంట మండలం అనంతరం గ్రామంలోని అంగన్వాడి కేంద్రంలో సోమవారం సర్పంచ్ వోల్లాల రజిత వెంకటేశం ఆధ్వర్యంలో పౌష్టికాహారంపై అవగాహన సదస్సు జరిగింది. సూపర్వైజర్ వీణ మాట్లాడుతూ పిల్లలు, గర్భిణీలు, బాలింతల ఆరోగ్యానికి సమతుల్యమైన పౌష్టికాహారం అవసరమని, ఆకుకూరలు, కూరగాయలు, పండ్లు, గుడ్లు, పాలు, పప్పుధాన్యాలు, పరిశుభ్రమైన నీరు, వ్యక్తిగత పరిశుభ్రత ప్రాముఖ్యతను వివరించారు. చిన్నారుల ఎదుగుదల, ఆరోగ్యంపై అవగాహన కల్పించి, "పౌష్టికాహారం తీసుకుందాం ఆరోగ్యవంతమైన తరాన్ని నిర్మిద్దాం" అనే నినాదంతో అంగన్వాడి కమిటీని కూడా ఏర్పాటు చేశారు.

సంబంధిత పోస్ట్

✕
✕