తిమ్మాపూర్ వద్ద గల లోయర్ మానేరు జలాశయానికి (ఎల్ఎండీ) భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. జలాశయంలోకి 54వేల క్యూసెక్కుల నీరు ప్రవాహం ఉంది. దీంతో అధికారులు 14 గేట్లను ఎత్తి, 66వేల క్యూసెక్కుల నీటిని మానేరు వాగులోకి విడుదల చేస్తున్నారు. 10 గేట్లను నాలుగు ఫీట్ల మేరకు, మరో నాలుగు గేట్లను మూడు ఫీట్ల మేరకు ఎత్తి నీటిని కిందకు వదులుతున్నారు. జలాశయంలోకి వచ్చే నీటి ప్రవాహాన్ని బట్టి స్పిల్ వే గేట్లను పెంచడం లేదా తగ్గించడం జరుగుతుందని అధికారులు తెలిపారు.