ఈహెచ్‌ఎస్‌ కార్డుదారులకు రాయితీపై ఓపీ సేవలు

ఎల్లారెడ్డిపేట మండలంలోని అశ్విని ఆస్పత్రి మేనేజింగ్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ అభినయ్‌ గోవర్ధనం, టీయూటీ రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షుడు కొండికొప్పుల రవి, టీఎస్‌యూటీఎఫ్‌ జిల్లా కార్యదర్శి తిరుపతి జాదవ్‌ను సోమవారం మర్యాదపూర్వకంగా కలిశారు. అశ్విని ఆస్పత్రిలో ఉద్యోగుల ఆరోగ్య పథకం (ఈహెచ్‌ఎస్‌) వైద్య సేవలు అందుబాటులోకి తీసుకురావడంపై వారు ఆస్పత్రి యాజమాన్యానికి కృతజ్ఞతలు తెలిపారు.

ఈహెచ్‌ఎస్‌ కార్డుదారులకు ఉచిత ఓపీ సేవలు అందించాలని కోరగా, 25 శాతం రాయితీతో వైద్య సేవలు అందించే అంశాన్ని ఆస్పత్రి యాజమాన్యం పరిశీలిస్తున్నట్లు తెలిపారు. అలాగే జిల్లాలో తొలిసారిగా గుండె సంబంధిత యాంజియోప్లాస్టీ, స్టెంట్‌ చికిత్స సేవలను అశ్విని ఆస్పత్రిలో అందుబాటులోకి తీసుకురానున్నట్లు వెల్లడించారు.

సంబంధిత పోస్ట్

✕
✕