హుజూరాబాద్ మున్సిపల్ పరిధిలో గురువారం కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ నిర్వహించిన బిజెపి విజయసంకల్ప సభకు ఐదవ వార్డు ప్రజలు భారీగా తరలివచ్చారు. బిజెపి అభ్యర్థి భూసమల స్రవంతికి మద్దతుగా ప్రజలు తరలిరావడంతో, మోడీ పాలనలో బండి సంజయ్ సారధ్యంలో హుజురాబాద్ అభివృద్ధి చెందుతుందని, హుజురాబాద్ లో బిజెపి గెలుపు ఖాయమని భూసమల స్రవంతి పేర్కొన్నారు. ప్రజల స్పందన బీజేపీకి అనుకూలంగా ఉంది.