నిండు కుండాలా రహీంఖాన్ పేట చెరువు

ఇల్లంతకుంట మండలం రహీంఖాన్ పేట గ్రామంలోని చెరువు నిండి అలుగు పారడంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. కురిసిన వర్షాలతో చెరువు నిండింది. మండలంలోని అన్ని చెరువులు నిండి వరద కాలువలు ప్రవహిస్తున్నాయి. బిక్కావాగు నుండి వచ్చే కాలువ ద్వారానే రహీంఖాన్ పేట చెరువుకు నీరు చేరుతుంది. చెరువు నిండిన నేపథ్యంలో రైతులు అన్ని పంటలు పండించుకునే అవకాశం ఉందని సంతోషిస్తున్నారు.

సంబంధిత పోస్ట్

✕
✕