శంకరపట్నం మండలం గద్దపాక జడ్పీహెచ్‌ఎస్ బయోసైన్స్ స్కూల్ అసిస్టెంట్ రమ్యశ్రీకి మండల స్థాయి ఉత్తమ ఉపాధ్యాయురాలి పురస్కారం లభించింది. మండల కేంద్రంలోని మోడల్ స్కూల్‌లో నిర్వహించిన కార్యక్రమంలో ఎమ్మార్వో సురేఖ, ఎంఈఓ లక్ష్మీనారాయణ, హెచ్‌ఎంలు భూమిరెడ్డి, నీరజ, సుభాష్ చేతుల మీదుగా ఆమె అవార్డు అందుకున్నారు. విద్యార్థులను ప్రోత్సహించి జ్ఞానవంతులుగా తీర్చిదిద్దాలని సూచించారు.