కరీంనగర్ మాల మహానాడు ఆధ్వర్యంలో నాయకులు మంగళవారం నగర మేయర్‌కు వినతిపత్రం సమర్పించి, మాల కమ్యూనిటీ హాల్ అభివృద్ధి, మౌలిక వసతుల కల్పన, స్మశాన వాటికల అభివృద్ధి, అంబేడ్కర్ విగ్రహాలకు రక్షణ వంటి పలు డిమాండ్లను మేయర్ దృష్టికి తీసుకెళ్లారు. మాలల సంక్షేమానికి చర్యలు తీసుకోవాలని, పెండింగ్ సమస్యలు త్వరగా పరిష్కరించాలని కోరారు. మేయర్ సానుకూలంగా స్పందించి పరిశీలిస్తామని హామీ ఇచ్చినట్లు నాయకులు తెలిపారు.