ఎరడపల్లిలో వాగు ఉద్ధృతి: పంట నష్టం, గ్రామస్తుల్లో ఆందోళన

కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలం ఎరడపల్లి గ్రామంలో వాగు పొంగిపొర్లడంతో గ్రామస్తులు ఆందోళన చెందుతున్నారు. అభయ ఆంజనేయస్వామి గుడి వద్ద వాగు నీరు రోడ్డుపైకి చేరడంతో రాకపోకలు నిలిచిపోయాయి. వరి, పత్తి, మక్కజొన్న పంటలు నీటమునిగి భారీ నష్టం వాటిల్లిందని రైతులు తెలిపారు. ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకుని నష్టపరిహారం అందించాలని రైతులు విజ్ఞప్తి చేస్తున్నారు. స్థానిక అధికారులు పరిస్థితిని పరిశీలించేందుకు గ్రామానికి చేరుకున్నారు.

సంబంధిత పోస్ట్