మల్యాల మండల కేంద్రానికి చెందిన ఆడపల్లు రాములు (55), కూలి పనులు చేస్తూ, అప్పుడప్పుడు పాములు పట్టి జీవనోపాధి పొందుతుండేవాడు. ఈ నెల 19న ఒక విషసర్పాన్ని పట్టుకొని ఇంటికి తీసుకురాగా, అదే రోజున ఆ పాము అతని కుడిచేతిని కరిచింది. వెంటనే 108 అంబులెన్స్‌లో జగిత్యాల ప్రభుత్వ ఆసుపత్రికి, అనంతరం వరంగల్ ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు. శుక్రవారం ఉదయం 9:15 గంటలకు చికిత్స పొందుతూ రాములు మరణించారు. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు ఎస్ఐ నరేష్ తెలిపారు.